సూర్యాపేట కేకే మీడియా నవంబర్ 4
బీఆర్‌ఎస్‌తోనే మెరుగైన పాలన అందించబడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి సునిత అన్నారు. శనివారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పేటలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
బీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి సునిత జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని పిల్లలమర్రి ,12 వ వార్డులో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను, మ్యానిఫెస్టోను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. గత రెండు పర్యాయాలు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నిటిని నెరవేర్చిన ఒకే ఒక్క పార్టీ దేశంలో బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధిని గుర్తించి మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గత పాలకుల హయాంలో అంతర్గత రహదారుల నిర్మాణాలు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడే వారన్నారు. 2014లో మంత్రి జగదీశ్ రెడ్డి కి వేసిన ఓటు సూర్యాపేట పట్టణంలోని ప్రతి గల్లీను సి.సి రహదారిగా మార్చిందని అన్నారు. సూర్యాపేటలో దేశంలోనే నెంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు మంత్రి జగదీష్ రెడ్డి నడుంబిగించారన్న సునీత , ౩0 వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి, జరుగుతున్న అభివృద్ధి యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.