హుజూర్నగర్ కేకే మీడియా మార్చి 28
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వమని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ ఆర్ అండ్ బి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తో కలిసి . మంగళవారం కౌండిన్య ఫంక్షన్ హాల్ లో హుజూర్నగర్ రూరల్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడా రు. అనంతరం జిల్లా ఆత్మీయ సమ్మేళన ఇంచార్జ్(r&b) కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ….గతపలకుల హయాంలో తెలంగాణ కు అన్యాయం చేశారు…రాష్ట్రం ఏర్పాటు కాకముందు రైతులకి నాణ్యత లేని కరేంటు అందించింది..తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయి పెళ్లి చేసేందుకు ఇబ్బంది ఉండకూడదు ఆని కళ్యాణ లక్ష్మి, షాద్ ముబరాక్ చెక్కులు అందిస్తున్నారు…కులవృతులను ప్రోత్సహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే…ఊరూరా సీఎం కేసీఆర్ చేస్తూన్న అభివృధి ని ప్రజలందరికీ తెలిసేలా చెయ్యాలి…బిజేపి పార్టి MLC కవితపై అక్రమ కేసులు పెడుతున్నారు…. ప్రజలకు అది వివరించాలి…ప్రతీ కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలి అని అన్నారు…
అనంతరం ఈ సందర్భంగా *ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ…..గతంలో వివిధ పార్టీలు పరిపాలించడం జరిగినది. 8 ఏళ్లు బిఆర్ఎస్ పార్టీ పరిపాలించడం జరిగింది గతానికి ఇప్పటికీ ఎన్నో తేడాలు ఉన్నాయి గతంలో ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి లేదని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో సరైన నీటి వసతి లేక విద్యుత్ లేక ఎన్నో ఇబ్బందులను ప్రజలు ఎదుర్కోవడం జరిగిందని అన్నారు.తెలంగాణ ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ప్రజల కష్టాలను తెలుసుకొని కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ప్రజల బాధలను గ్రహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేకమైన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేసిన నాయకుడు సీఎం కేసీఆర్ గారిని గర్వంగా పేర్కొన్నారు.నేడు హుజూర్ నగర్ మండలం లో అన్ని గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు రావడం జరుగుతుందని అన్నారు . వ్యవసాయ రంగానికి రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్ కెసిఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు, వంటి నగదు రూపంలో తో పాటు గ్రామ గ్రామాన సిసి రోడ్లు నిర్మించిన ఘనత బిఆర్ఎస్ పార్టీలను తెలిపారు .అన్ని విధాలుగా రైతులకు అండగా నిలిచి గతంలో వ్యవసాయం అంటే దండగ కానీ కేసీఆర్ గారి వ్యవసాయం అంటే పండగ నిరూపించింది. అదే కాక ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుండి మన ప్రాంతానికి కూలి పని చేయడానికి రావడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకం, తెలంగాణ రాష్ట్రంలో దళితుల కోసం సీఎం కేసీఆర్ గారు దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం దళితుల ఆత్మ గౌరవంగా బతకాలని అన్ని వర్గాలతో సమానంగా ఆత్మగౌరవంతో జీవించాలని దళిత బంధు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అని తెలిపారు.దేశంలో తెలంగాణ రాష్ట్ర అమలు అవుతున్న సంక్షేమ పథకాలను చూసి రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావాలని సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో సీఎం కేసీఆర్ గారి పరిపాలన మా ప్రాంతాల్లో కూడా కావాలని బిఆర్ఎస్ పార్టీ వైపు మగ్గుచూపుతున్నారు. గ్రామాలే దేశానికి పట్టికొమ్మలు గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ప్రతిపక్ష పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి,బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సీఎం కేసీఆర్ గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి నాకు కూడా మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరారు…