పాలకీడు కేకే మీడియా ఆగస్టు 5
ఎంపీ బాపురావు పై ఫిర్యాదు
బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి కెళావత్ మధు నాయక్
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వ్యాఖ్యనిచ్చిన భాజపా ఎంపీ సోయం బాపురావు పై చర్యలు తీసుకోవాలని గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి కెళావత్ మధు నాయక్ పాలక వీడు మండల పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగపరమైన వచ్చినటువంటి ఎంపీ హోదాలో ఉండి రాజ్యాంగాన్ని అగౌరపరిచి అవమానం చేస్తున్నారని అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే గిరిజనులను తన రాజకీయ స్వలాభం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని తెలంగాణను మరో మణిపూర్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హనుమాన్ నాయక్ ఆర్ పి నాయక్ శివా నాయక్ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు