హైదరాబాద్ కేకే మీడియా ఫిబ్రవరి 20
బాలయ్యకు బాలయ్య సాటి అని మరోసారి నిరూపితమైంది. నందమూరి బాలకృష్ణ అన్న కుమారుడు నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించిన విషయం విధితమే. ఆసుపత్రిలో చేర్పించినప్పటి నుండి ఎక్కువ రోజులు ఎక్కువ సమయం కేటాయించి అన్ని తానే చూసుకున్న బాలకృష్ణ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి
వారి కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చా రు
నందమూరి బాలకృష్ణ, తారకరత్న మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారకరత్న మరణించడం తో. తారకరత్న ముగ్గురు పిల్లల బాగోగులు తానే చూసుకుంటానని, తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి కూడా కుటుంబ పరంగా అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.