నేరేడుచర్ల కేకే మీడియా అక్టోబర్ 1
తెలుగుదేశం పార్టీ నాయకులు , చంద్రబాబు నాయుడు అభిమానులు ఆదివారం నేరేడుచర్ల మండల కేంద్రం నుండి హుజూర్ నగర్ మండలంలోని గోపాలపురంలో గల ఆంజనేయ స్వామి దేవాలయం వరకు సమారు ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు పాల్వాయి రమేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇట్టి పాదయాత్ర నేరేడుచర్ల సెంటర్ లో గల శ్రీ కోదండ రామ స్వామి దేవాలయం వద్ద పూజలు చేసి ప్రారంభించి గోపాలపురం ఆంజనేయస్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు . చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలని ఆయురారోగ్యాలతో మళ్లీ అధికారం చేపట్టాలని కోరుతూ ఆలయంలో పూజలు నిర్వహించారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇంజమూరి వెంకటయ్య నిమ్మగడ్డ సుబ్బారావు ఏనుగంటి పుల్లయ్య వెంగళరావు పోలవరపు చిట్టిబాబు వల్లభనేని మాధవరావు కుంకు మోహన్ రావు చెరుకుమల్లి కిషోర్ మల్లవరపు అనిల్ కె. మాల్యాద్రి బోయ నరేందర్ బొల్ల నవీన్ అల్లు నాగభూషణం గజ్జల లక్ష్మణ్ మరియు నాయకులు సుంకర క్రాంతి కుమార్ పాతూరి శ్రీనివాస్ రావు నేరేడుచర్ల టౌన్ పార్టీ అధ్యక్షుడు పొనుగోటి జంగారావు కుంకు మోహన్ రావు అల్లు నాగభూషణం, సుంకర ప్రదీప్తి , రమణమ్మ, పూర్ణ చౌదరి, చెరుకూరి తిరుపతమ్మ, పచ్వ పద్మ, వేమూరి నాగవేణి, రమా, సుజాత , సంగీత, పాతూరు సత్యవతి, రాధా, జ్యోతి, మంగ, విజయ రమాదేవి, సుమ, రాజేశ్వరి , గరిడేపల్లి హుజూర్ నగర్ టౌన్, హుజూర్ నగర్ మండలం , మఠంపల్లి, చింతలపాలెం మండలాలకు చెందిన నాయకులు పాతకోటి లింగారెడ్డి నేలపట్ల అంజయ్య షేక్ అలీ రావిరాల లింగయ్య బెల్లంకొండ గోవింద్ పాల్గొన్న ఇట్టి పాదయాత్రకు పలువురు కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. మార్గమధ్యలో గల గరిడేపల్లిలో గల స్వర్గీయ ఎన్ టి రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాయినిగూడెం గ్రామంలో కార్యకర్తలు హారతులతో స్వాగతం పలికారు. ఇట్టిపాదయాత్రలో రాయినీ గూడెం గ్రామం నుండి నేరేడుచర్లకు చెందిన మహిళలు పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గోపాలపురం చేరుకొని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి చంద్రబాబు నాయుడు గారిపై గల అక్రమ కేసులు రద్దు పర్చాలనీ చంద్రబాబు గారిపై, వారి కుటుంబ సభ్యలపై స్వామి వారి దీవెనలు అదించాలనీ వారికి గల శత్రు పీడ వీడాలనీ వారి ఆరోగ్యం క్షేమంగా ఉండాలని వేడుకున్నారు.