నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 16
పట్టణానికి చెందిన వేప చేదుల సైదులు (50) నేరేడుచర్ల పట్టణంలో సమోసాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. తన ఎడమ కాలుకు దెబ్బ తగిలి షుగర్తో కాలు తీసివేయగా ఆర్థికంగా పేద కుటుంబం అయిన సైదులు కుటుంబానికి అండగా సిరి సూపర్ మార్కెట్ అధినేత యారవా సురేష్ నేతృత్వంలో సోషల్ మీడియాలో సైదులు సమస్యని తెలపడంతో పట్టణానికి చెందిన పలువురు స్పందించి 39328 రూపాయల విరాళాలు అందించగా మంగళవారం నాడు అతని ఇంటికి వెళ్లి బాధితునికి అందించి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్, గజ్జల కోటేశ్వరరావు, శంకరాచారి, శ్రీను ,మధు,రాంబాబు అనిల్, జానీ తదితరులు పాల్గొన్నారు