మిర్యాలగూడ కే కే మీడియా ఫిబ్రవరి 21:
మిర్యాలగూడ పట్టణంలో నార్కట్పల్లి -అద్దంకి హైవే లో మిర్యాలగూడ పట్టణానికే చెందిన యువకుడు స్పీడుగా వస్తున్న లారీ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు:
పట్టణంలో చర్చి రోడ్లు నివాసం ఉంటున్న విజయ్
పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.స్థానిక ఖలీల్ దాబా సమీపంలో లారీని ఎదురు వెళ్లి డీ కొని సూసైడ్ కు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళ వారం అద్దంకి_నార్కట్ పల్లి ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. మొదట ఓ కంటైనర్ వద్ద కింద పడేందుకు ప్రయత్నం చేసిండు. కంటైనర్ డ్రైవర్ అప్రమత్తమై తప్పించ గా..మరో లారీ కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీ సులు ఘటన స్థలం పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.