హైదరాబాద్ కే కే మీడియా జూలై 28:
తెలంగాణ బడ్జెట్లో బీసీలకు 20వేల కోట్లు కేటాయించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.
ఆదివారం హైదరాబాదులో సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిందని
.. ప్రకటించిన ప్రకారం అమలు చేయాలని బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆ ఎన్నికల్లో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి ఉన్నారని 56 శాతం గా ఉన్న బీసీలకు రాష్ట్ర బడ్జెట్లో కేవలం 9000 కోట్లు మాత్రమే కేటాయించాలని అట్టి బడ్జెట్లో బీసీలకు 20 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ధనుంజయ నాయుడు తన ప్రసంగంలో పేర్కొన్నారు
బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఆగస్టు 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు’ బీసీ డిమాండ్స్ డే” గా ధర్నాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు