నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 11
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను నేరేడుచర్ల పట్టణ,మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన కూడలి వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు మాట్లాడుతూ……….. అహంకార ధోరణితో బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రోజు రోజు బిజెపికి ప్రజాదరణ తగుతున్నందున తగ్గుతుండడంతో రెచ్చగొట్టే వాక్యాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. వెంటనే బండి సంజయ్ క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు,మార్కెట్ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ బాబు,నియోజక వర్గ నాయకులు వల్లంసెట్ల రమేష్ బాబు, సింగిల్ విండో చైర్మన్ అనంత శ్రీనివాస్ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, మండల ఉపాధ్యక్షుడు సుదర్శన్, మండల యూత్ అధ్యక్షుడు నందిపాటి హిందూజా, అధికార ప్రతినిధి ఇంజమూరి మల్లయ్య, పల్లెపంగ నాగరాజు, కట్ట కళావతి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.