నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి25:
క్రీడా ప్రాంగణానికి తాళం అన్న వార్తతో నేరేడుచర్ల మున్సిపాలిటీ అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టారు. వాస్తవానికి కొద్దిరోజులు మాత్రమే క్రీడలనుకున్న యువతకు నిరుత్సాహం ఎదురైంది. ఆటలాడుకునేటప్పుడు వర్షాలు వచ్చి భారీగా నీరు నిలవడంతో ఆటలాడుకునే అవకాశం దొరకలేదు ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి నిధుల తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ క్రీడా ప్రాంగణం ముందు నుంచి డ్రైనేజీ లేకపోవడంతో అక్కడ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోవడం వృధా నీరు క్రీడా ప్రాంగణంలోకి చేరడం దీనికి తోడు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తాళాలు వేసుకుంటున్నారన్న ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో అటుగా వెళ్ళినప్పుడు తాళాలు వేసి ఉండడాన్ని గమనించి కేకే మీడియా తెలుగు ఛానల్ లో వార్త రావడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపట్టారు. పూర్తిస్థాయిలో దాన్ని మెరుగుపరిచి యువతకు ఉల్లాసానికి శారీర దారుణ్యానికి ఉపయోగపడే క్రీడలు ఆడుకునేందుకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని యువత కోరుతుంది