హైదరాబాద్ కేకే మీడియా ఆగస్టు 13
కీప్యాడ్ మొబైల్స్ ఉన్నప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఎలాంటి సమస్యలు ఉండకపోయే రాను రాను ఫీచర్లు పెరిగి రికార్డింగ్ లు చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కొత్త ఫీచర్లు ఆటోమేటిక్గా ఫోన్ లో రికార్డులు అవుతుండడం ముఖ్యంగా రాజకీయ నాయకులు మాట్లాడాలంటేనే హడలెత్తిపోతున్నారు ఎవరు ఏం మాట్లాడుతారు ఎవరితో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడితే ఏ కొంప మునుగుతుందో అన్న భయాందోళన నడుమ జనరల్ కాల్స్ ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఎత్తాల్సి వచ్చిన వేరే విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగండి అంటూ ఫోన్ ఆపేసి వాట్సాప్ కాల్స్ లో మాట్లాడుకుంటున్న పరిస్థితి.
ఎవరితో ఏం మాట్లాడితే ఏం కొంపమునుగుతుందో అన్న భయాందోళన నడుమ సాధారణ కాల్స్ కంటే వాట్సప్ కాల్స్ రాజకీయ నాయకులు ఎక్కువగా వాడుతున్నారు. కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం వాట్సప్ కాల్స్ కూడా రికార్డు చేసుకోవచ్చన్న వార్తలు వినివస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎవరితో ఏం మాట్లాడితే ఏ కొంపలు మునుగుతాయో ఏం జరుగుతుందో అని భయాందోళన నడుమ రాజకీయ నాయకులు ఉన్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీల నుండి అసెంబ్లీ బరిలో నిలిచే నాయకులకు ఎవరికి ఎప్పుడు ఎక్కడ నుంచి ఫోన్ వస్తుందో టికెట్ అవకాశం వస్తుందో రాదో పుచ్చగించడానికి పిలుస్తున్నారు లేక ఇంటెలిజెన్స్ రిపోర్టులను వినిపించడానికి పిలుస్తున్నారు సర్వేల ఫలితాలు చెప్పేందుకు పిలుస్తున్నారు తెలియక ఆయా పార్టీల హై కమాండ్ నుంచి ఫోన్లు వస్తేనే గజగజ వణికి పోతున్నారు కొందరు నేతలు.
అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంతవరకు వారి భయాందోళన తప్పని తలనొప్పిగా మారింది నాయకులకు.