గరిడేపల్లి కేకే మీడియా మార్చి 10
మండలంలోని మంగాపురం గ్రామానికి చెందిన గిరిజన మహిళ తేజావత్ సునీత మంగాపురం రాయినిగూడెం కట్టవారిగూడెం. గ్రామాలకు ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తుండగా రాయినిగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి సురేష్ తనను అసభ్యంగా మాట్లాడాడని మనస్థాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సునీత చెప్పిన వివరాల ప్రకారం గిరిజన మహిళ మరియు వితంతువు ,వికారాంగురాలైన తాను మూడు గ్రామాలకు ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తుండగా గత రెండు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో వైద్యం నిమిత్తం విజయవాడ వెళుతున్న సందర్భంలో రాయినిగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగగా వైద్య నిమిత్తం విజయవాడ వెళుతున్నాను అని చెప్పగా నువ్వు ఇంట్లోనే ఉన్నావు అబద్ధాలు చెబుతున్నవూ అంటూనే
నువ్వు తాగుతా వంట కదా నేను కూడా రావచ్చా అంటూ అసభ్యకరంగా మాట్లాడినట్లు లిఖితపూర్వక సూసైడ్ నోట్ రాసి మంగాపురంలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ఇంటి పక్కనీ వారు గమనించి అప్రమత్తతతో ఊరి నుండి తప్పించగా ప్రాణాపాయం తప్పింది. ఇట్టి విషయం బయటకు పోక్క కుండా పంచాయతీ కార్యదర్శికి సహకరించేందుకు మండల పరిషత్ అధికారులు తీవ్ర ప్రయత్నం చేసినట్లు సమాచారం . కార్యదర్శి సైతం తన తమ్ముడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడని ఎవరైనా తన విషయంలో తలదూరిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని అంటున్నట్లుగా సమాచారం.