వేములపల్లి కేకే మీడియా మార్చి
ప్రయివేట్ బస్సు డీ కొని వలస ఆవులు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బుగ్గబాయిగూడెం గ్రామ సమీపంలోని నార్కట్ పల్లి అద్దంకి రహదారిపై మంగళ వారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడుకొమ్ము మండలం కాసారాజు పల్లి గ్రామానికి చెందిన రామావత్ రాము, రామావత్ బిక్కన్ లు మరికొందరితో కలసి ఆవులని మేపెందుకు వేములపల్లి వైపు వస్తున్నారానారు. మిర్యాలగూడ వైపు నుండి హైద్రాబాద్ వైపు వెళ్తున్న ప్రయివేట్ బస్సు ఆవుల మందను డీ కొనడంతో 14 ఆవులు మృతి చెందగా మరో ఆరు ఆవులు గాయపడినట్లు బాధితులు పేర్కొన్నారు. ఒక్కో ఆవు విలువ సుమారు 40 వేలు వరకు ఉండగా సుమారుగా ఏడు లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.