Wednesday, May 21, 2025
HomeEntertainmentప్రైమ్ టైం సినిమాలు

ప్రైమ్ టైం సినిమాలు

నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు

టిల్లు స్క్వేర్: గత రెండేళ్లలో మంచి ఆదరణ పొందిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన డీజే టిల్లు చిత్రానికి తాజాగా టిల్లు స్క్వేర్ అనే సీక్వెల్ వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సిద్ధు జొన్నలగడ్డను స్టార్‌గా నిలబెట్టడంతో పాటు 100 కోట్ల క్లబ్‌లో చేరిన టైర్ 2 హీరోగా కూడా పేరు తెచ్చుకుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ రొమాన్స్, క్రైమ్ మరియు కామెడీ చిత్రం మార్చి 15న సాయంత్రం 6 గంటలకి స్టార్ మా మూవీస్ ఛానల్ లో ప్రదర్శించబడింది. ఈ చిత్రంలో నేహా శెట్టి మరియు ప్రియాంక జవాల్కర్ అతిధి పాత్రలు పోషించారు. ప్రిన్స్ సెసిల్, నేహా శెట్టి, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించింది. అచ్చు రాజమణి, రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు.

హనుమాన్: ప్రశాంత్ వర్మ యొక్క సూపర్ హీరో యాక్షన్ చిత్రం “హనుమాన్” 2024లో అతిపెద్ద హిట్‌లలో ఒకటి గా నిలిచింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ 250 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ సినిమాలు ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను మార్చి 15న సాయంత్రం 6 గంటలకి ప్రదర్శించటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో తేజ సజ్జ ప్రేమికురాలిగా అమృత అయ్యర్ నటించగా, అతని సోదరిగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటించింది. వినయ్ రాయ్ విలన్ గా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ విఎఫ్‌ఎక్స్ భారీ చిత్రాన్ని నిర్మించారు.

మసూద: తెలుగు హారర్ చిత్రం మసూద 2022 బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. సాయి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తిరువీర్, అఖిలా రామ్, కావ్య కళ్యాణ్ మరియు సంగీత ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జెమినీ టీవీలో ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి షెడ్యూల్ చేయబడింది. మార్చి 15, 2025న రాత్రి 7 గంటలకు జెమినీ మూవీస్ ఛానల్ లో ప్రీమియర్ చేయబడుతుంది. ఈ చిత్రంలో సుబలేఖ సుధాకర్, సత్య రాజేష్ మరియు ఇతరులు సహాయక పాత్రల్లో నటించారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments