మఠంపల్లి, కెకే మీడియా డిసెంబర్ 25:
రాష్ట్ర క్రైస్తవ సోదరులకు,తన నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని మఠంపల్లి నందు 100 సంవత్సరాల చరిత్ర గల మఠంపల్లి శుభవార్త దేవాలయంలో అర్ధరాత్రి మిడ్ నైట్ మాస్ క్రిస్మస్ ప్రార్థనలకు ముఖ్య అతిథిగా నీటిపారుదల శాఖ- పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఈ చారిత్రక శుభవార్త దేవాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని,తాను గతంలో మంత్రిగా ఉన్న సమయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ భవనాన్ని, అనేక క్రైస్తవ శ్మశాన వాటికలను నిర్మించిన విషయం గుర్తు చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని క్రైస్తవుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని,యేసు క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవ సోదర, సోదరీమణులు పండుగలా ఆనందోత్సాహాలతో జరుపు కుంటారని యేసుక్రీస్తు ప్రవచించిన ప్రేమ,కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని అన్నారు.యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని,శాంతి సౌభ్రాతృత్వం కరుణ క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీ యమని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాముల శివారెడ్డి, బచ్చలకూరి బాబు, హుజూర్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుంకరి శివరాం,ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు తేజావత్ సైదులు నాయక్, మండల అధ్యక్షుడు భూక్య మంజునాయక్,మాజీ సర్పంచ్ ఆదూరి స్రవంతి కిషోర్ రెడ్డి,క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.