ప్రతిష్ఠాపనకు సిద్ధమైన అయ్యప్ప దేవాలయం
ఆగస్టు 19న ఆలయ, విగ్రహాల, ధ్వజస్తంభ ప్రతిష్టాపన
హాజరుకానున్న మంత్రి ఉత్తమ్ దంపతులు, ఎంపీ రఘువీర్ రెడ్డి*
నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 13:
నేరేడుచర్ల పట్టణంలో సుమారు కోటిన్నర రూపాయలతో దాతల సహాకారంతో నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ప్రతిష్టాపన మహోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు నిర్వాహకులు . నేరేడుచర్ల పట్టణంలోని శ్రీ విజయ దుర్గ ఆలయ సమీపంలో పట్టణానికి చెందిన కీర్తిశేషులు కొణతం గోపిరెడ్డి కుమారుడు కొణతం కృష్ణారెడ్డి సంధ్యా దంపతులు విరాళంగా అందించిన విశాలమైన స్థలంలో దాతల సహకారంతో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని నిర్మించారు. ఈనెల 17 నుండి 19 వరకు ఆలయ, విగ్రహాల, ధ్వజస్తంభ, ప్రతిష్టాపన మహోత్సవాలకు వేద పండితులు ముహూర్తం నిర్ణయించారు. జిల్లా మంత్రి, స్థానిక శాసనసభ్యులు కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు ఆయన సతీమణి కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి మరియు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి లను ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.
గరిడేపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన వేద పండితులు ఇరువంటి వెంకటరమణ శర్మ, సత్యనారాయణ శర్మ, జొన్నాబట్ల కిషోర్ శర్మల బృందం నేతృత్వంలో విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 17న ఉదయం 9:30 కి గణపతి పూజ, పంచగవ్యప్రాసన, గోపూజ, రక్షాబందన, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం షాడశస్తంభ పూజలు, సర్వతోభద్రమండవ, నవగ్రహ, చతుషష్టియోగిని, వాస్తు, క్షేత్రపాలకల అవాహనలు, మూలమంత్ర అనుష్టానములు, అగ్నిమధన, సాయంతం 4గంటలకు మృత్యంగ్రహణ, అంకురారోపాణ, మూలమంత హోమాలు, మండప హోమాలు, రుద్రహవనం, 18న పుణ్యాహావాచనం, గోపూజ, పంచగవ్యాధి, అభిషేకాలు, జలాభిషేకం, (ప్రతి ఒక్కరూ పాలు, నీళ్లతో స్వహస్త్రాలతో విగ్రహాలకు అభిషేకం) 5గంటలకు మూలమంత్ర సమేత ఆరుణ హోమం, నీరాజన మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వినియోగం. 19న ఉదయం 7.35 గణపతి పూజ, 8.51 కి యంత్రస్థాపన, బింభాస్థాపన, కళాన్యాసం, కళాహోమం, కుంభధేను దర్శనం, నేత్రోన్యాసం, ప్రధమపూజ, మహాపుర్ణాహుతి, మహదాశీర్వాచనం కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనంతరం సుమారు 10వేల మంది భక్తులకు మహా అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రతిష్టా మహోత్సవాలకు నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి పెన్పహాడ్, మిర్యాలగూడ మండలాల నుండి వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటవంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు.