నేరేడుచర్ల కేకే మీడియా అక్టోబర్ 28
నేరేడుచర్ల ప్రముఖ వ్యాపారవేత్త , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్వాయి రమేష్ (52)సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు.
తండ్రి పాల్వాయి హనుమంతరావు ఆశయసాధనలో ఏర్పాటుచేసిన శ్రీ వెంకటేశ్వర దేవాలయ కళ్యాణ మహోత్సవాన్ని సోమవారం నాడు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం పూర్తవగానే ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే ఉన్న ఆర్.ఎం.పి గమనించి ఫస్ట్ ఎయిడ్ చేసి మిర్యాలగూడ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తీసుకువెళ్లే క్రమంలో మార్గమధ్యంలో గుండెపోటు తో మృతి చెందారు. ఆస్పత్రికి తరలించే దాంతో డాక్టర్లు చనిపోయారని నిర్ధారించడంతో ఏరియా ఆసుపత్రికి తరలించి షాప్ ట్రీట్మెంట్ ఇప్పించిన ప్రయోజనము లేకపోయింది.
దైవ కార్యక్రమాలతోపాటు, హైందవ,స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని
తన దగ్గరకు వచ్చిన వారికి అన్న అని వచ్చిన వారికి నేనున్నానంటూ చేతనైన సహాయం చేస్తూ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.
అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు అభిమానిగా నేరేడుచర్ల పట్టణ పార్టీ అధ్యక్షుడుగా జిల్లా నాయకునిగా ఇదివరకు తెలుగుదేశంలోనే కొనసాగారు.
శనివారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్నారు.
సొంతంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం సోమవారం నిర్వహిస్తూ ఉండగా వాటి ఏర్పాట్లలో వారం నుంచి నిమగ్నమై
మధ్యాహ్నం రెండు గంటల వరకు కళ్యాణం నిర్వహించి వేలాదిమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అనంతరం చాతిలో నొప్పి వచ్చి కింద పడిపోగా పక్కనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ సి పి ఆర్ చేస్తూ మిర్యాలగూడ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృత్యువాత పడ్డారు .ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు మిత్రులు అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు.