Friday, March 21, 2025
HomeTelanganaప్రమాద బీమా కుటుంబానికి ధీమా: పోస్టల్ సూపరింటెండెంట్ వడ్లమూడి వేంకటేశ్వర్లు

ప్రమాద బీమా కుటుంబానికి ధీమా: పోస్టల్ సూపరింటెండెంట్ వడ్లమూడి వేంకటేశ్వర్లు

నేరేడుచర్ల కేకే మీడియా

బీమా తీసుకున్న వారి కుటుంబాలకు ఈ ప్రమాద బీమా ధీమాగా ఉంటుందని సూర్యాపేట డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్లు అన్నారు మండల పరిధిలోని మేడారం గ్రామంలో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా గ్రామానికి చెందిన మామిడి నాగయ్య గత ఆరు నెలల క్రితం టాటా ఏఐజి నుండి పదిలక్షల ప్రమాద బీమా తీసుకొని మార్చి 12న రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో మృతుని భార్య మామిడి సునీత కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత నగదు రహిత సేవల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గ్రామాల్లో ఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా లేకున్నా కేంద్ర ప్రభుత్వ కార్యాలయం అయిన పోస్ట్ ఆఫీస్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించే అన్ని రకాల పథకాలను ఇంటింటికి చేరవేయడం కోసం తమ సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు ఈ ప్రమాద బీమా తీసుకునే వారికి సంవత్సరానికి రూ.520 కట్టి ప్రమాదం జరిగితే 10 లక్షల రూపాయలు అందుతాయని ఈ అమౌంట్ రోజు రూపాయి 50 పైసలు పడుతుందని తెలిపారు దీంతోపాటు పోస్ట్ ఆఫీస్ లో ఆర్ పి ఎల్ ఐ, పి ఎల్ ఐ రెగ్యులర్ పాలసీలు కూడా ఉన్నాయని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు పోస్టల్ సిబ్బంది గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు ఐపిపిబి హుజూర్నగర్ శాఖ మేనేజర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రమాద బీమాకు సంబంధించిన పాలసీల్లో ఇప్పటికీ 19 మందికి కోటి 90 లక్షల రూపాయల క్లైములు అందించినట్లు తెలిపారు తెలంగాణ టాటా ఏసీ సేల్స్ మేనేజర్ వీరేందర్ మాట్లాడుతూ పోస్టల్ శాఖ తమ శాఖ ఒప్పందంతో ఇప్పటికీ అనేకమందికి పాలసీలు సేకరించడ జరిగిందని అందుకు పోస్టల్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ పోస్టల్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గౌని సురేష్, అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మణ్, మెయిల్ వర్సెల్ జి కోటయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత,మాజీ సర్పంచ్ సుంకర బోయిన స్వాతి మధు, స్థానిక బ్రాంచ్ పోస్ట్మాస్టర్ చౌగాని రాంబాబు, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ కవి శ్రీలేఖ, మాజీ బీపీఎం అప్పారావు, బీపీఎంలు ,ఏబీపీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments