నకిరేకల్ కేకే మీడియా ఫిబ్రవరి 23:
నకిరేకల్ మున్సిపాలిటీలోని స.నెం. 89 దండెకుంటలోని ప్రభుత్వభూమిని ఆక్రమించి అక్రమంగా గేట్లు వేసిన ప్రైవేట్ శక్తులపై కఠిన చర్యలు తీసుకోకపోతే వారం రోజుల్లో వాటిని తొలగించి నిలువ నీడలేని వందలాది మంది నిరుపేదలతో పక్కా నివాసాలను ఏర్పాటు చేస్తామని” ప్రజా పోరాట సమితి(PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు.
ఈరోజు వాసవీ కాలేజీ ప్రక్కన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం వద్ద ఆందోళన నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. “జిల్లా సర్యేయర్ దీనిని ప్రభుత్వ భూమి అని తేల్చి, మున్సిపల్ కమీషనర్ చెట్లు నాటిన తరువాత ఏవిధంగా ప్రైవేట్ భూమి అవుతుందో జిల్లా కలెక్టర్ తేల్చాలి. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమిస్తే కిమ్మనని అధికార యంత్రాంగం పేదల హక్కులను ఎలా అడ్డుకుంటారో చూస్తామని”అన్నారు.
ఇందులో నాయకులు నేరేడు లింగయ్యయాదవ్,దుర్గం జలంధర్, మాగి సైదులు,కప్పల రాకేష్ గౌడ్, మహేశ్వరం సుధాకర్, చౌగోని సైదులుగౌడ్, పెంటమళ్ళ రమేశ్ ఉన్నారు.