Friday, September 20, 2024
HomeTelanganaప్రభుత్వ బడినీ కాపాడుకుందాం

ప్రభుత్వ బడినీ కాపాడుకుందాం

పాలకీడు కేకే మీడియా జూన్ 1:
మన పిల్లల్ని మన ఊరి బడికి పంపించి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం అని అధ్యాపక ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. గురువారం నాడు పాలకీడు మండలంలోని బత్తలపాలెం గ్రామంలో తెలంగాణ పౌరస్ స్పందన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా విచ్చేసి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక రోజు రోజుకు నెరవేర్ ఏమవుతున్నాయని ప్రైవేటు మోజులు విద్యార్థులను ఖర్చు అదనంగా అవుతున్నప్పటికీ దూర ప్రయాణం చేయించి మరి ప్రైవేటు పాఠశాలల పంపడం సరైనది కాదని మన గ్రామంలో మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోకుంటే భవిష్యత్తులో గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండదని అన్నారు. సభకు విచ్చేసిన గ్రామ విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం మాట్లాడుతూ గ్రామంలో రోజురోజుకు తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యతో ప్రభుత్వాన్ని కావలసిన వసతులు అధ్యాపకులను ఇతర అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటన్నింటినీ సాధించుకోలేని దుస్థితి ఏర్పడుతుందని కనీస విద్యార్థుల సంఖ్య ఉంటేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన సమస్యలు మన గ్రామ పాఠశాల సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఇది దృష్టిలో ఉంచుకొని ప్రతి తల్లిదండ్రులు మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునేలా అనే విద్యార్థులను పంపాలని కోరారు.
అనంతరం పాలకీడు ఎంపీపీ భూక్య గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేసేలా అధ్యాపకుల నియామకం ఇతర అవసరాల కల్పనలో విఫలమైందని దీనికి తోడు విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనలు మారాయని ఆర్థిక స్తోమత లేకున్నా గొప్పగా చదువు రావాలని గొప్పలు పోతూ ప్రైవేటు పాఠశాలలకు పంపించడం జరుగుతుందని అన్ని అర్హతలు ఉన్న అధ్యాపకులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య అందుతున్న చేర్పించకపోవడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మండల విద్యాధికారి చత్రు నాయక్ మాట్లాడుతూ గురుకులాలు బలోపేతం కావడంతో ఐదవ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ గురుకులాలకు వెళ్తున్నారని మిగిలినవారు గొప్పల కోసం ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని అతి తక్కువ మంది మాత్రమే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వస్తున్నారని దీని కారణంగానే విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతోందని ఉన్నదాంట్లో మెరుగైన విద్యను అందిస్తున్నప్పటికీ విద్యార్థుల రాక తక్కువగా ఉందని ప్రభుత్వం ఆదేశించిన బడిబాట కార్యక్రమంలో అధ్యాపకులు అందరితో ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులను కలుపుకొని బడిబాటలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులు చేరేలా కృషి చేస్తామన్నారు.
గ్రామ సర్పంచ్ భోగాల వీరారెడ్డి మాట్లాడుతూ మా గ్రామ ప్రభుత్వ పాఠశాలను బతికించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్థికంగా భారమైన వ్యక్తిగతంగా ఇతర మిత్రులతో గ్రామ ప్రజలతో కలిసి ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన అన్ని అవసరాలు తీర్చుతున్నప్పటికీ గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు మాత్రం పాఠశాలకు తమ విద్యార్థుల్ని పంపకుండా ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని ఇలానే కొనసాగితే రెండు మూడు సంవత్సరాలలో పాఠశాల కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని మౌలిక వసతులు ఏది అవసరమైన ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం అందించిన అందించకుండా వ్యక్తిగతంగా ఇతర గ్రామ ప్రజల సహకారం తీసుకునైనా పూర్తిస్థాయిలో సమకూరుస్తామని హామీ ఇచ్చారు

తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో పిన్నపురెడ్డి వెంకట్రెడ్డి హుజూర్నగర్ డివిజన్ హౌరా స్పందన వేదిక అధ్యక్షుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా TPSV అధ్యక్షులు ధన మూర్తి, వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్, ఎంపీటీసీలు దొంగరి వెంకన్న , మీసాల ఉపేందర్, ఉప సర్పంచ్ అంద వెంకటయ్య, TPSV రాష్ట్ర కార్యదర్శి మంగ, జిల్లా కార్యదర్శి సుంకర క్రాంతి కుమార్,, సిపిఎం మండల కార్యదర్శి అనంత ప్రకాష్, గురుమూర్తి UTF జిల్లా కార్యదర్శి సిరికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments