ప్రభుత్వ కాలేజీకి ఫ్యాన్లు బహుకరణ
నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు క్రాంతినికేతన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం నాడు నాలుగు సీలింగ్ ఫ్యాన్లను క్రాంతినికేతన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సుంకర క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు.
గతంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు అందించిన క్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మీటింగ్ హాల్లో ఫ్యాన్లు లేకపోవడం వల్ల అసౌకర్యంగా ఉందని సహకరించాలని కోరడంతో ఈరోజు కళాశాలలో అందజేయడం జరిగింది. కళాశాల పూర్వ అధ్యాపకులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ముడుంబై రామానుజాచార్యులు మరణించిన సందర్భంగా ఆయనకు నివాళులర్పించడం జరిగింది.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మయ్య, అధ్యాపక బృందo, కొప్పు రామకృష్ణ గౌడ్, జింకల భాస్కర్, కాసాని నాగరాజు , నాగరాజు తదితరులు పాల్గొన్నారు