ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి
సిపిఐ డిమాండ్
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కేకే టీవీ జనవరి 6
ఆరు గ్యారంటీల పేరుతో నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తక్షణమే ఆరు గ్యారెంటీలని అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలుపునిచ్చారు
శనివారం నాడు ఆయన నేరేడుచర్ల లోని ప్రజా పాలన కేంద్రంలో వినతి పత్రం ఇచ్చిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ…
.
ప్రజా పాలన పేరుతో అధికారులు గ్రామాలలో ప్రజల నుండి దరఖాస్తు స్వీకరిస్తున్నారని స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సమయం తీసుకోకుండా వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే పేరుతో అనేక సమస్యలను సర్వేలు చేసి ఒక సమస్యను కూడా పరిష్కరించలేదని ఈ ప్రభుత్వం కూడా వారి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని లేనిచో ప్రజలు అనేక ఇబ్బందులు అనుభవించవలసి వస్తుందని వారు అన్నారు ఎలాంటి తారతమ్య బాధలు లేకుండా ప్రజలందరికీ ప్రజా పథకాలు అందే విధంగా చూడాలని వారన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా ఇల్లు రేషన్ కార్డు భూమి లేకుండా అనేకమంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఈ ప్రభుత్వం అయినా ప్రజా పాలన పేరుతో తీసుకున్న ప్రతి దరఖాస్తు ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇలా ప్రజా పాలన పేరుతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని వారు కోరారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కేసులో ఉన్న వాళ్లే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలని ఆ ఆప్షన్ ని తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం పేరు అని పెడితే బాగుంటుందని వారు సూచించారు బైండోవర్ కేసులు కూడా పరిగణలోకి తీసుకొని వారిని ఉద్యమకారులుగా గుర్తించి వారికి 250 గజాల స్థలం ఇప్పించాలని సకల జనుల సమ్మె సమయంలో కెసిఆర్ గాని కుటుంబం గాని ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొనలేదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రమం తప్పకుండా పాల్గొన్న వారిని గుర్తించి వారికి తగు న్యాయం చేయాలని ఆయన కోరారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు యారమాద శ్రీను పాల్గొన్నారు