విజయవాడ కేకే మీడియా మార్చి 1
నిర్మాణంలో ఉన్న ప్రపంచస్థాయి నగరాలతో ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ ఓ జాబితా రూపొందించింది. ఈ టాప్ -6 భవిష్యత్ నగరాల జాబితాలో ఏపీ రాజధాని అమరావతికి సైతం స్థానం లభించింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్థిరంగా అభివృద్ధి చెందే ఒక ఆధునిక నగరాన్ని ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో అమరావతి నిర్మాణం చేపట్టినట్టు చంద్రబాబు వెల్లడించారు.