మిర్యాలగూడ కేకే మీడియా మార్చి 12
గుండెపోటుపై అందరికీ అవగాహన అవసరమని మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు శివాని విద్యా సంస్థల విద్యార్దుల అద్వర్యంలో గుండెపోటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు..ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ , మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ పాల్గొని మాట్లాడారు..ఈ సందర్భంగా విద్యార్దులు మనిషి గుండె పోటు కు గురి అయినప్పుడు సి.పి.ఆర్ ( కార్డియో పల్మనరీ రిస్క్ స్టేషన్ ) పై అవగాహన నిర్వహించారు. ప్రమాద పరిస్థితిలో ఉండే వ్యక్తిని రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో శివాని విద్యా సంస్థల యాజమాన్యం కుందూరు శ్యాం సుందర్ రెడ్డి, కుందూరు నాగలక్ష్మి, కౌన్సిలర్ ఉదయ్ భాస్కర్, కందగట్ల అశోక్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎం.డి షోయబ్, ఏలుగుబెల్లి నాగరాజు, షైక్ ఫయాజ్, రాములు తదితరులు పాల్గొన్నారు.