మిసూర్యాపేట కేకే మీడియా ఆగస్టు 27
ప్రతి ఎకరాకు నీరు అందించి రైతుల ఆదుకోవాలని ఏ ఒక్క రైతును ఇబ్బంది పడేలా చూడొద్దని సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించి వెంటనే సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యపేటలోని క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష. నిర్వహించి మాట్లాడుతూ
ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎట్టి పరిస్థితిలో రైతులకు ఇబ్బంది కలిగించొద్దని.. ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది అంతా అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఎలాంటి ఆటంకం లేకుండా రైతుల పంట పొలాలకు నిరందేలా చూడాలన్నారు. ఈ సమీక్షలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ MLA చిరుమర్తి లింగయ్య, ఇరిగేషన్ CE రమేష్ బాబు, SE శివ ధర్మతేజ, EE లు భద్రు నాయక్, విజయ్ కుమార్ లతో పాటు DE లు, AE లు పాల్గొన్నారు.