మిర్యాలగూడ కేకే మీడియా
ప్రజా నాయకుడిగా పేరుపొంది ఉమ్మడి మిర్యాలగూడ తో పాటు మిర్యాలగూడ నియోజకవర్గంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి అన్ని వర్గాల ప్రజలతో మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్న సిపిఎం పార్టీ అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి మరోమారు మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నడంతో మిర్యాలగూడ నియోజకవర్గం లో ఎవరి గెలుపు పై ప్రభావం చూపబోతుందో అన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తు దాదాపుగా ఖరారై మిర్యాలగూడ స్థానాన్ని జూలకంటి రంగారెడ్డికి పొత్తులో భాగంగా వస్తుందని అందరూ ఊహించినప్పటికీ అనుహంగా కాంగ్రెస్ పొత్తు చిత్తు కావడంతో మిర్యాలగూడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ తో పొత్తు ఉండి జూలకంటి రంగారెడ్డి పోటీ చేస్తే మిర్యాలగూడ స్థానాన్ని సునాయాసంగా గెలుచుకోవచ్చన్న ధీమాలో ఉన్న ప్రస్తుత టిఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు పొత్తు విఫలమై కాంగ్రెస్ నుంచి భత్తుల లక్ష్మారెడ్డి పోటీలో ఉండడంతో టిఆర్ఎస్ కాంగ్రెస్లో మధ్య పోరు నువ్వా నేనా అన్న చందంగా మారాయి. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నిత్యం ప్రజల మనిషిగా ప్రజలలోనే తిరుగుతున్న జూలకంటి రంగారెడ్డి పోటీలో ఉండడంతో ఎన్ని ఓట్లు సిపిఎం పార్టీ చీల్చుకుంటుందో ఆ ఓట్లు చీలిక ఎవరిపై ప్రభావం పడుతుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అభ్యర్థులు పొత్తు వేరే వారికి ఇచ్చినప్పుడు కసిగా పనిచేసే వారి గెలుపుకు దోహదపడే పరిస్థితి. అదే సిపిఎం నిలబడినప్పుడు పొత్తులో ఉన్న అవతల పార్టీ ఓట్లు పూర్తిస్థాయిలో వచ్చే పరిస్థితి ఉండేది కాదు. గత ఎన్నికల్లోను ఒంటరిగా పోటీ చేసిన జూలకంటి సాధించిన ఓట్లు కనక మళ్ళీ సాధిస్తే కచ్చితంగా ఓట్ల ప్రభావం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే అంశమే. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కరరావు అన్ని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరినీ మెప్పించి ఒక అడుగు ముందు ఉన్నప్పటికీ కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి రంగోలిలో దిగిన బత్తుల లక్ష్మారెడ్డి అంత ప్రభావం చూపగలిగే వ్యక్తి కాడని అయ్యప్ప ఇతర స్వాముల పూజలకు, అన్నదాన కార్యక్రమాలు చేసినప్పుడు , రాజకీయకాంక్షతో సేవా కార్యక్రమాలు చేశాడన్న పరిస్థితుల నేపథ్యంలో మునిసిపాలిటీ చైర్మన్గా అవకాశం కాంగ్రెస్ ఇచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరికీ అవకాశం కల్పించగా కేవలం లక్ష్మారెడ్డి మాత్రమే గెలుపొంది భార్య ఓడిపోవడం గత ప్రభావాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ లక్ష్మారెడ్డి ఇస్తే గెలుస్తుంది అన్న ప్రచారంలో ముందు ఉండడంతో నామినేషన్ సమయంలో చేసిన జన సమీకరణ అతనికి అదనపు కలిసి వచ్చే అంశంగా మారడంతో గట్టి పోటీ ఇస్తున్నాడని ముమ్మరంగా ప్రచారం జరిగినప్పటికీ లక్ష్మారెడ్డి సామాజిక వర్గానికే చెందిన జూలకంటి రంగారెడ్డి 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒకటే సామాజిక వర్గం అయినప్పటికీ అందరితో సఖ్యతగా ఉండి ఇదే చివరి అవకాశం అని చెబుతూ తన ఓటు బ్యాంకు ని పెంచుకొని గెలవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా అతనికి పడే ఓట్లు ఎవరిని చిత్తు చేస్తాయో ఎవరిని అందలం ఎక్కిస్తాయో తెలుసుకోవాలంటే 10 రోజుల సమయం తప్పదు మరి.