ప్రజల భద్రత కోసమే కార్డాన్ అండ్ సెర్చ్ : సిఐ రామలింగ రెడ్డి
నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 6
సంఘ విద్రోహక శక్తులు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజా జీవనాన్ని ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు రక్షణ కల్పించడమే కార్డాన్ అండ్ సెర్చ్ ముఖ్య ఉద్దేశ్యమని హుజూర్ నగర్ సిఐ రామలింగ రెడ్డి చెప్పారు. నేరేడుచర్ల పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారు జామున 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు రెండు గంటల పాటు పెంచికల్ దీన్నే గ్రామంలో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు ఊర్లో కి వస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారు. కార్డాన్ అండ్ సెర్చ్ ద్వారా ప్రజలలో భద్రతా భావం పెరుగుతుందని చెప్పారు. గ్రామం లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉంటూ నిరంతర నిఘా, పెట్రోలింగ్ వాహనాలతో పర్యవేక్షణ చేస్తున్నామని వివరించారు. కార్డాన్ అండ్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 73 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, ఒక టాటా ఏస్ వాహనాన్ని సీజ్ చేసి, సరైన పత్రాలు వాహన యజమాని ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి, పెండింగ్ చల్లన్ కట్టించి వాహనాన్ని అందజేశారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్డాన్ సెర్చ్ లో సీఐతో పాటు, స్థానిక ఎస్ఐ పరమేష్,ఐదుగురు ఎస్.ఐ.లు, ఇద్దరు ఏ.ఎస్.ఐ లు, హెడ్ కానిస్టేబుల్స్, 20 మంది కానిస్టేబుల్స్, హోంగార్డు లు పాల్గొన్నారు.