హైదరాబాద్ కే కే మీడియా జనవరి 21
ఆహార కల్తీల జోరు
ప్రజల ఆరోగ్యం బేజారు
పత్తా లేని ఫుడ్ సేఫ్టీ అధికారులు…
ఆహార కల్తీ రోజు రోజుకు పెరిగిపోతుంది. నిత్యం తినే వాడే ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
నిత్యం రోడ్లపై తయారు చేసే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రోడ్ సైడ్ పానీ పూరి, బండ్లపై వేసే చిరు తిండ్లు, హోటల్లు, నిత్యం కల్తీమయం నాసిరకం పదార్థాలు వాడి వంటలు వండి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
నాసిరకం ఆహార పదార్థాలు తయారు చేసే కంపెనీల మొదలు , అవి వాడి వంటలు చేసి అమ్ముతున్న వ్యాపారుల వరకు ప్రజల ఆహారానికి ఎంత హాని కలుగుతుందో తెలిసిన ధనార్జన ధ్యేయంగా ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటూ ప్రజల ఆరోగ్యాలను హరిస్తున్న వారిని కట్టడి చేసేందుకు అధికారులు మొద్దు నిద్ర వీడి నిత్యం దాడులు నిర్వహించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.