ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత గుండె పరీక్షలు నిర్వహించాలి… పౌరస్పందన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు సుంకర క్రాంతి కుమార్
ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని , ప్రతి పౌరునికి గుండె పరీక్షలు విధిగా నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడాలని జిల్లా పౌర స్పందన వేదిక ఉపాధ్యక్షుడు సుంకర క్రాంతి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం హుజూర్నగర్లో విలేకరుల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిరోజు ఎక్కడో ఒకచోట వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్టుతో ఎన్నో వందల ప్రాణాలు పోతున్నాయని, కనీసం ముందస్తు లక్షణాలు లేకుండా వస్తున్న హృద్రోగ మరణాలు అరికట్టాలంటే ప్రభుత్వమే బాధ్యతగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఉచిత హృద్రోగ పరీక్షల తో పాటు బిపి, షుగర్ తదితర ముఖ్యమైన పరీక్షలు నిర్వహించి ప్రజల ప్రాణాలకు బాధ్యత తీసుకోవాలని కోరారు.
గతంలో వయసు మీద పడిన వారికి , అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే గుండెపోట్లు వచ్చేవని, ముఖ్యంగా కరోనా తర్వాత వయసుతో సంబంధం లేకుండా భావి భారత యువత మృత్యువాత పడుతున్నారని, కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి.కరోనాకు తీసుకున్న వ్యాక్సినే కారణమని, చెబుతున్నా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యంతో పాటు ఆర్థిక బారం అవుతున్న కారణంగానే ఎక్కువమంది ప్రజలు పరీక్షలకు మొగ్గు చూపటం లేదని, ప్రభుత్వమే బాధ్యతగా ఆరోగ్య పరీక్షల నిర్వహణ జరిపితే మరణాల్ని నివారించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన ఆరోగ్య పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
కార్యక్రమంలో హుజూర్నగర్ డివిజన్ పౌరస్పందన వేదిక అధ్యక్షులు శ్రీరాముల ఆంజనేయులు, పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షులు నందిగామ రత్న కుమార్ ,. కొప్పు రామకృష్ణ.. లు పాల్గొన్నారు