హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 11
లేటుగా , లేటెస్ట్ గా అనిహంగా హుజూర్నగర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన
చల్ల శ్రీలత ప్రచారానికి ప్రజల నుండి అపూర్వ స్పందన
లభిస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందితో నవంబర్ 10 నాడు నామినేషన్ దాఖలు చేసి శనివారం నాడు ప్రచారంలోకి దూసుకెళ్తోంది.
సొంతమందలమైన నేరేడుచర్ల నుండి ప్రచారం మొదలుపెట్టగా ఆడబిడ్డగా నేరేడుచర్ల ప్రజలు అక్కున చేర్చుకుంటున్నరు
.. హుజూర్ నగర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కమలం పువ్వుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 7వ వార్డు,8వ వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. చల్ల శ్రీలతకు మహిళలు బ్రహ్మరథం పలికారు . హుజూర్ నగర్ ఆడబిడ్డగా ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. . ఈ సందర్భంగా చల్ల శ్రీలతక్క మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న వ్యక్తిగా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యులు బాల వెంకటేశ్వర్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి యువకులు తదితరులు పాల్గొన్నారు.