ఉత్తమ పోలీసులకు ఘన సన్మానం
నేరేడుచర్ల మండలానికి చెందిన కాట్రగడ్డ శ్రీనివాస్
జాతీయస్థాయిలో ఇండియన్ పోలీస్ మెడల్ సాధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోగా మండలంలోని సోమవారం గ్రామానికి చెందిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ బి లో సేవలందిస్తూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారమందుకొన్న గంట సత్యనారాయణ లకు నేరేడుచర్ల కాకతీయ కమ్మ సంఘం ఆధ్వర్యంలో నేరేడుచర్ల లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా పథకాలు పొందాలని ఆకాంక్షించారు.
సుంకర క్రాంతికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రావులపల్లి ప్రసాద్, కౌన్సిలర్లు కుంకు సులోచన శ్రీనివాస్, వేమూరి కృష్ణవేణి నారాయణ, న్యాయవాది సుంకర ప్రదీప్తి, నిమ్మగడ్డ సుబ్బారావు, అన్న, కుంకు తిరుపతయ్య, చిన్నయ్య, నారాయణ, పాతూరు శ్రీనివాస్, శేఖర్, రోశయ్య, మాధవరావు, వెంకటేశ్వరరావు, చిట్టిబాబు, శీను, కిరణ్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.