అమరావతి కేకే మీడియా ఆగస్ట్ 28 :
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీపి కబురు అందించింది. పెండింగ్ సహా అన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. కేబినెట్ సమావేశంలో పోలవరానికి కేంద్రం కీలక ప్రతిపాదన చేసింది. ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి రూ.12,500 కోట్ల ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనల ఆమోదం కోసం సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కోరారు. దీనికి ఇప్పటికే పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. నవంబరు నుంచి కొత్త డయాఫ్రం వాల్ పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనుల్లో వేగం పెంచేందుకు కేంద్రం నుంచి వచ్చే నిధులు వేగవంతం కానున్నాయి. పోలవరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త డీపీఆర్ ను రూపొందించింది. ఇది ముందుకు సాగాలంటే కేంద్ర నుంచి తప్పనిసరిగా నిధులు విడుదల కావాలి. వారం కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రెండు రోజులు అక్కడే ఉన్నారు.
పోలవరానికి నిధుల గురించి ఆయన ప్రధాని మోడీ, మంత్రులు నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చించారు. పోలవరంలో 45.71 మీటర్ల మేర నీళ్లు నిల్వ ఉంచేందుకు అవసరమయ్యే పనులకు నిధులు సమకూర్చాలని చంద్రబాబు కోరారు. దీంతో ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు ఆర్థికశాఖ పోలవరం నిధుల అంశాన్ని మంత్రిమండలి ముందు ఉంచింది. పోలవరం తొలి దశకు అవసరమయ్యే పూర్తి నిధులను అంచనా వేసి, పోలవరం డీపీఆర్ ను రూపొందించారు. ఇందుకయ్యే పూర్తి నిధులకు పలుస్దాయిలలో ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రిమండలి ఆమోదించినందున వెంటనే నిధులు విడుదలకు మార్గం సుగమమైంది. దీంతో పోలవరం పనులు పరుగులు పెట్టే అవకాశం ఉంది.
అమరావతి, పోలవరం తనకు రెండు కళ్లగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర రైతుల సాగునీటి కష్టాలు తీరతాయి. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని నిల్వచే యవచ్చు. గత ప్రభుత్వం దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోలేదనే అపవాడు మూటగట్టుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగా పోలవరం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు ప్రాజెక్టును పరిశీలించారు. అప్పటి వరకు జరిగిన పనులపై ఆరా తీశారు ప్రాజెక్టు నిర్మాణంలో సవాళ్లను అధ్యయనం చేసి సరైన మార్గనిర్దేశనం చేసేందుకు కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు ఆధారిటీ కలిసి విదేశీ నిపుణుల బృందాన్ని నియమించాయి ఈ బృందం పోలవరాన్ని పరిశీలించి కీలక సిఫార్సులు చేసింది. డిజైన్ మార్పులతో కొత్త దయాష్ట్రం వాల్ ప్రధాన ం నిర్మించాలని పేర్కొంది. ఇందుకోసం కొత్త ప్రాజెక్ట్ డిజైన్ను కూడా సిద్దం చేసింది ఈ డీపీఆర్ కు పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదముద్ర వేశాయి. చివరిగా ఈ రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా పొందింది.