హైదరాబాద్ కేకే మీడియా డిసెంబర్ 26
తెలంగాణలో లో ఖరీఫ్ లో సరైన వర్షాలు లేక పంటలు వేయలేక పోయిన రైతులు, పంట వేసి దక్కించుకోలేకపోయిన రైతులు రవి లోనైనా సాగు చేద్దామని అనుకున్న సరైన వర్షాలు పడకపోవడం ప్రాజెక్టులు నిండకపోవడం ప్రాజెక్టుల్లో తక్కువ నీరు ఉండడంతో ప్రభుత్వం అధికారికంగా క్రాప్ హాలిడే ప్రకటించింది.
వ్యవసాయం మీదనే ఆధారపడే రైతు వ్యవసాయం చేయకుంటే ఇంకా ఎలా బతికేది అంటూ గతంలో ఎప్పుడూ వేసిన బోర్లు బావులను బాగు చేసుకుని ఉన్న దానిలో కొంత భాగమైన పంటలు పండించే ప్రయత్నం చేస్తుండగా మేము సైతం ఏదో కొంతైనా వ్యవసాయం చేయాలంటే బోర్లు తప్పదు అనుకొని అప్పులు చేసి మరి సాగర్ ఎడమ కాలు వాయ కట్టుకుంది రైతులు ఒకరిని చూసి మరొకరు బోర్లు వేస్తుండడం, బోరు బండ్ల వారికి ఆదాయ వనరుగా మారింది.
ఒక్క ఎకరాలు 10 బోర్లు వేసిన మరో బోరు కోసం ప్రయత్నం చేస్తూ లక్షలు అప్పుల పాలవుతున్న ఏదో చిన్ని ఆశ మళ్లీ మళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
మళ్లీ వ్యవసాయం బోర్లు లేకుంటే ఇక వ్యవసాయం చేయలేమా అన్న ఆందోళనలో ఉన్న రైతులు మరో ఆధారం లేక వ్యవసాయం చేయాలా అనే ఉద్దేశంతో విపరీతంగా బోర్లు వేస్తున్న ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నిబంధనకు తూర్పు పొడిచిన వ్యాపారులు బోరు బండ్లు అధిక ధరలకు రైతులను దోచుకుంటున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యారు.
మళ్లీ పాత రోజులు వచ్చాయి దేవుడా ఎట్లా బతికేది అంటూ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బోరు పడితే ఖర్చైనా సంతోషమే కానీ పడకుంటే అప్పు పెరిగే వ్యవసాయం చేయకపోయే ఎట్లా బతికేది అంటూ ఆవేదన చెందుతున్నారు రైతులు.
పొలాల్లో బోరుబండ్ల జోరు.. నిబంధనల బేఖాతరు…
RELATED ARTICLES