హైదరాబాద్ కేకే మీడియా నవంబర్ 29
ఎన్ని చెప్పినా, ఏది చెప్పినా, ఎంతమంది అవగాహన కల్పించిన నా ఓటు మాత్రం డబ్బుకే అంటున్నారు ఓటర్లు.
ప్రజాస్వామ్య భారతదేశంలో రాజకీయ వ్యవస్థ రోజు మలినమై అవినీతి తాండవిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓటరు నేను తక్కువ తిన్నానా అంటూ రోజురోజుకు అవినీతిపరుడుగా మారిపోతున్నాడు. ప్రజాస్వామికవాదులు అవగాహన కోసం ఓటు విలువను, భవిష్యత్తును చెబుతున్నప్పటికీ ఓటరు మాత్రం ఇవన్నీ పట్టణట్లుగా ఎవడైతే నాకేంటి నా ఓటు మాత్రం నేను అమ్ముకుంటా అంటూ ఓటర్లలో 90 శాతం ఓటర్లు పోటీలో ఉన్న అన్ని పార్టీల నుండి డబ్బులు ఆశించడం తో నిజమైన ప్రజా సేవకులు ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే హడలిపోతున్నారు.
ఒక్కసారి ఓటుతో ఐదేళ్ల పాలన ఉంటుందని తెలిసిన ఈరోజు నాకేమిస్తావు రేపు నాకు ఏం చేస్తావ్ అని ప్రశ్నించే ఓటర్లు ఎక్కువ . దీంతో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి బాధలను పంచుకుంటూ వారికోసం పాటుపడే నాయకులు వీరికి ఎంత చేసినా ఏం చేసినా ఓట్లప్పుడు డబ్బులు ఇస్తే చాలని భావించి డబ్బులు ఉన్న బడాబాబులు రాజకీయాల్లోకి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ వ్యవస్థ మారాలి అనుకోవడం కూడా తప్పేనా అంటున్నారు ప్రజాస్వామికవాదులు.