నేరేడుచర్ల కేకే మీడియా జూలై 22
అనారోగ్యంతో బాధపడుతున్న పేద రజకుడికి లైన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో శనివారం నాడు ఆర్థిక సహకారం అందించారు. నేరేడుచర్లకు చెందిన దేవరకొండ రాములు ఇస్త్రీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా కనీసం సొంత ఇల్లు లేని రాములు షుగర్ వ్యాధితో బాధపడుతూ కాలుకు కలిగిన గాయానికి ఆపరేషన్ చేయించుకోక కాళ్ళ రెండు వేలులను తీసివేయడం తో ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటుండగా వారి ఆర్థిక పరిస్థితిని గమనించి లైన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో తొమ్మిది వేల రూపాయల నగదు తో పాటు 50 కిలోల బియ్యం నిత్యవసర వస్తువులు కూరగాయలను అందించారు.
ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల లైన్స్ క్లబ్ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ రెడ్డి కార్యదర్శి రామస్వామి కోశాధికారి రామకృష్ణ సభ్యులు పో రెడ్డి శ్రీరామ్ రెడ్డి ,సత్యనారాయణరెడ్డి ,బట్టు మధు ,సుంకర క్రాంతి కుమార్ , కర్రీ సూరిబాబు, గుండా సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు