నెరెడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 28:
నేరేడుచర్ల మండల కేంద్రంలో అమరజీవి కామ్రేడ్ పారేపల్లి మోహన్ రావు మూడవ వర్ధంతిని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అనంత ప్రకాష్ నేరేడుచర్ల పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్ నేరేడుచర్ల మండలా రూరల్ మండల కార్యదర్శి సిరికొండ శ్రీను సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ధనుంజయ నాయుడు టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి చిత్తలూరి సైదులు మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
అనంతరం జరిగిన సంతాప సభలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కందగట్ల అనంత ప్రకాష్ మాట్లాడుతూ మానవుని జీవితంలో పుట్టడం చనిపోవడం మానవ పరిణామ క్రమంలో భాగమని మనం బ్రతికినంత కాలం ఎవరికి ఏం చేశారు అదే ముఖ్యమని ఆయన అన్నారు.
. పారేపల్లి మోహన్ రావు ఉద్యమాల పురిటిగడ్డ కమ్యూనిస్టు ఉద్యమాల గడ్డ బండమీద చందుపట్ల లో పుట్టి తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మోహన్ రావు బతుకుదెరువు నిమిత్తం నేరేడుచర్లకు వచ్చి తను బ్రతుకుతూ పేద ప్రజల సమస్యల కోసం పేదల బాగోగుల కోసం తను నమ్మిన సిద్ధాంతం కోసం 1987లో అప్పటి ఎమ్మెల్యే అరబండి లక్ష్మీనారాయణ కృషితో ఏర్పడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి ఎస్ఎఫ్ఐ ఉద్యమానికి బాటలు వేసిన ఉద్యమ వీరుడు అని ఆయన కొనియాడారు అంతేకాదు ఎంతోమంది పేద విద్యార్థులను దరికి చేర్చుకొని ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో ఇమ్మర్చుకొని ఎస్ఎఫ్ఐ ఉద్యమాన్ని సిపిఎం పార్టీని ముందుకు తీసుకుపోవటంలో ఆయన పాత్ర మరువలేనిదని అన్నారు ఎంతో మంది యువకిశోరాలను ఎస్ఎఫ్ఐ ఉద్యమంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదేనని అందులో భాగంగానే చిత్తలూరు బాల సైదులు నరేష్ వీరస్వామి మరి నాగేశ్వరరావు వీరస్వామి లాంటి ఎంతోమంది విద్యార్థులను ప్రజాతంత్ర ఉద్యమంలోకి తీసుకువచ్చి నేరేడుచర్ల పట్టణంలో సిపిఎం పార్టీ ప్రజాతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన ఘన చరిత్ర ఆయనది అన్నారు అంతేకాకుండా ప్రజాశక్తి విలేఖరిగా నూతన తెలంగాణలో నవ తెలంగాణ విలేకరిగా మూడు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తికి న్యాయం చేస్తూ ప్రజా సమస్యలను వెలికితీస్తూ ఆదర్శవంతంగా నిలిచాడని కొనియాడారు అంతేకాకుండా సిపిఎం పార్టీ తరఫున మూడు పర్యాయాలు నేరేడుచర్ల గ్రామపంచాయతీ వార్డు సభ్యునిగా ఎనలేని సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ పరిష్కరిస్తున్న గొప్ప నాయకుడు మోహన్ రావు ముఖ్యంగా అతను ప్రాతినిధ్యం ఊహించిన చింత బండ ప్రజానీకం పేదలందరూ ఆయన వెంట నడుస్తూ ఉన్నారని చింత బండ ప్రజలు అంటే మోహన్ రావు మోహన్ రావు అంటే చింత బండ ప్రజలు మమేకమై వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ఆయన ఆశయ సాధన నెరవేర్చాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసినప్పుడే ఆయనకు మనం ఇచ్చిన ఘనమైన నివాళిని ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కంకణ బద్దులం కావాలని ఆయన పిలుపునిచ్చారు