Friday, March 21, 2025
HomeTelanganaపేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పాటుపడుతుంది... రాష్ట్ర మంత్రులు ఉత్తం, పొంగులేటి

పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పాటుపడుతుంది… రాష్ట్ర మంత్రులు ఉత్తం, పొంగులేటి

హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబర్ 23
*ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తాం*.

*ఆదర్శ కాలనీని సత్వరమే పూర్తి* .

*రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,*

ఉత్తమ్ కుమార్ రెడ్డి…

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఎక్కడకూడా రాజీ పడకుండా ప్రభుత్వం పారదర్శకతతో అందచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రామస్వామి గుట్ట వద్ద ఆదర్శ నగర్ లో నిర్మించిన 2160 ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలసి పరిశీలించారు. తదుపరి స్థానిక మంత్రి క్యాంప్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన నియోజక వర్గ స్థాయిలో జరుగు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అమలుపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలసి మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ 2013లో స్థానికంగా గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను 3 నెలల లోపు పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు అందచేసి రాష్ట్రం లోని ఇందిరమ్మ ఇండ్లకు నాంది పలుకుతామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన 109 ఎకరాల భూమిని దాదాపు రూ. 20 కోట్లు రెవెన్యూ శాఖ ద్వారా చెల్లించి గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించడం జరిగిందని దాదాపు 70 శాతం పూర్తి అయిన పనులు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వరకు కూడా రూ.30 కోట్లు కేటాయించి పూర్తి చేయకపోవడం ఒక దుర్మార్గ మైన చర్యగా ఆయన అభివర్ణించారు. గత పది సంవత్సరాలుగా నియోజక వర్గంలో కేవలం 150 రెండు పథకాల గదుల ఇండ్లు నిర్మించి నిజమైన నిరుపేదలకు అందలేదని అన్నారు. 77 ఎకరాలలో ఉన్న ఆదర్శ కాలనీ ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అలాగే 32 ఎకరాలలో ఉన్న ఖాళీ స్థలంలో అర్హులైన వారిని గుర్తించి అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో సుపరిపాలన అందిస్తామని పాలకులం కాదు..సేవకులుగా ప్రజా సేవకు అంకితమవుతామని చెప్పారు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఒక్క గజం భూమి కూడా వదలమని తిరిగి అట్టి భూములను అర్హులైన పేదలకు అందించి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అన్నారు. గత ప్రభుత్వం మాటల గారడితో రాష్ట్రంలో ఎన్నో శంకుస్థాపన లు చేసుకుంటూ పోయిందని , రాష్ట్రాన్ని అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని ఈ సందర్బంగా తెలిపారు. ఈ నెల 27న ప్రజలకు తీపి కబురు ఉంటుందని అలాగే 6 గ్యారెంటిలతో పాటు మ్యానిఫెస్టో గల అన్ని అంశాలను పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. రెండు పడకలలో నచ్చిన వారికి ఇండ్లను అందచేసినట్లు ఫిర్యాదులు అందాయని అట్టి వారిపై విచారణ జరిపి అర్హులైన పేదలకు అందించాలని కలెక్టర్ కు సూచించారు.
అనంతరం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి* మాట్లాడుతూ నీటిపారుదల రంగంలో పటిష్ఠ ప్రణాళికతో రైతులకు మెరుగైన నీటి సదుపాయం కల్పిస్తామని జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ లు, చెక్ డ్యామ్స్ లను పునరుద్ధరించడం జరుగుతుందని అన్నారు. పి.ఆర్. అలాగే ఆర్.అండ్ బి శాఖ ల ద్వారా రోడ్ల మరమ్మత్తులు అలాగే కొత్త రోడ్లను వేపిస్తామని అన్నారు. మా ప్రభుత్వ హయాంలో ఒక ఆర్థిక సంవత్సరంలో 13 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ అనే మరిచిందని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ 6 గ్యారంటీలను రాజకీయాలకు అతీతంగా అందచేస్తామని ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పూర్తి న్యాయం జరుగుతుందని అన్నారు. రైతులకు ఎక్కడకూడా నష్టం వాటిల్లకుండా అనుబంధ శాఖల అధికారులు నిబద్ధతగా పనిచేయాలని లిఫ్ట్ ఇరిగేషన్ ల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మన్లను మరమ్మత్తులు సత్వరమే చేసి వినియోగం లోకి తేవాలని ప్రభుత్వం నుండి నిధులను సత్వరమే విడుదల చేస్తామని ఈ సందర్బంగా సూచించారు.

తదుపరి అన్ని శాఖల అధికారులతో నియోజక వర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ. వెంకట్ రెడ్డి, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ రమేష్, హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య, ఆర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి, సి.ఈ. ఓ సురేష్ కుమార్, పి.డి. కిరణ్ కుమార్, డి.పి.ఓ యాదయ్య, సి.పి.ఓ వెంకటేశ్వర్లు, తాశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు , ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments