కేకే టీవీ ఆగస్టు 30 హైదరాబాద్
వ్యాప్తంగా పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్క్ ఫెడ్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 64.175 ఎకరాలలో పెసర పంట సాగయ్యిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో 17841 మెట్రిక్ టన్నుల వరకు పెసర దిగుబడి రావచ్చని అంచనాలు వేశారు. పెసర పంటకు రూ.8,682 మద్దతు ధర ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పెసర కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని ఆదేశాలు జారీచేసారు.