గరిడేపల్లి కేకే మీడియా సెప్టెంబర్ 6
గరిడేపల్లి మండల కేంద్రంలో బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలకు వ్యతిరేకంగా ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ గరిడేపల్లి మండల కార్యదర్శి షేక్ యాకూబ్ మాట్లాడుతూ హర్యానా రాష్ట్రంలో హిందూ, ముస్లింల మధ్యన, మణిపూర్ లో నాగా, కుకీల మధ్యన, కాశ్మీర్ ఫైల్స్ పేరుతో సినిమా, కేరళ స్టోరీతో సినిమా, రజాకార్ ఫైల్స్ పేరుతో తెలంగాణలోసినిమా తీసి చరిత్రను మార్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసి, మతోన్మాదం మూఢనమ్మకాలు కుల, మతాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దోసపాటి భిక్షం, మహబూబ్ అలీ, నందిపాటి మట్టయ్య, ఆకుల అరవిందు, దోసపాటి సుధాకర్, తంబడి బిక్షం, యానాల సోమయ్య, బొల్లెపల్లి శ్రీనివాస్, ఎస్.కె హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు..