కేకే టీవీ సూర్యాపేట
పెద్దాయన హుషారు… కారు టాప్ గేర్
తనయుడు జగదీష్ రెడ్డి కి మద్దతుగా తండ్రి చంద్రారెడ్డి ప్రచారం
సూర్యాపేట లో బీఆర్ఎస్ శ్రేణులతో కలసి ప్రచారం నిర్వహించిన మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి గుంటకండ్ల చంద్రారెడ్డి
మహిళా నేతలతో కలిసి డ్యాన్స్ లు చేసిన వైనం
కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి కి పట్టం కట్టాలని ఇంటి ఇంటికి ప్రచారం
*సూర్యాపేట*
2014 నుండీ నేటి వరకూ సూర్యాపేట ను అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ, తండ్రి చంద్రారెడ్డి సూర్యాపేటలో పలు వార్డులో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 18 వ వార్డ్ లో ఎనిమిది పదుల వయసులోనూ గుంటకండ్ల చంద్రారెడ్డి హుషారు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. గడపగడపకు తిరుగుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ, ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ యువకులతో పోటీపడుతూ ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా భీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి చంద్రారెడ్డి చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధిని మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. 2014 ముందు ప్రస్తుత జరిగిన ప్రస్తుతం జరిగిన అభివృద్ధి బేరీజు వేసుకొని సరైన అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. సబండ వర్కర్ల సంక్షేమం భీఆర్ఎస్ తోనే సాధ్యం ఆన్న చంద్రారెడ్డి, సూర్యాపేట అభివృద్ధికి పార్టీలకతీతంగా ప్రజలు ఏకమై కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.