Monday, January 13, 2025
HomeTelanganaపెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి ఎన్నికల్లో విద్యార్థులకు...

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

కేకే మీడియా సూర్యాపేట ఆగస్టు 27

సూర్యపేట పట్టణంలోని ధర్మభిక్షం భవన్లో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విద్యార్థుల హామీలను వెంటనే అమలు చేయాలని అన్ని హామీలను అమలు చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని రాష్ట్రంలో విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వీసీల నియామకల జాప్యం లేకుండా వెంటనే నియమించి, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని రవికుమార్  డిమాండ్ చేశారు అదేవిధంగా రాష్ట్రంలో విద్యారంగం సమస్యలతో సతమతమవుతుందని, గురుకుల విద్యార్థుల  మరణాలు బాధాకరమని గురుకులాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు వారికి ఉన్న  సమస్యలు పరిష్కరించి కల్పించి  విద్యార్థులకు  ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండాలని  గురుకులాల్లో జరిగిన మరణాలపై విచారణ జరిపించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెపుతున్న సిఎం రేవంత్ రెడ్డి  మీ వద్దే విద్యాశాఖ ఉంది కదా మరి ఎందుకు విద్యారంగానికి ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయటం లేదని ప్రశ్నించారు.  విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రిక్ స్కూటీలు, అయిదు లక్షల విద్యార్థి భరోసా కార్డు లు మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు  హామీలను వెంటనే అమలు చేయాలన్నారు..పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా బిఆర్ఎస్ పూర్తి నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలు మొత్తం విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు పాతవి ,కొత్తవి అనడం సరికాదని వెంటనే ఫీజు బకాయిలు మొత్తం విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్రంలోని సంక్షేమ హాస్టలల్లో మౌలిక వసతులు కల్పించి అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు కొత్త భవనాలు నిర్మించి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు  పెంచాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం  అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ నాయకులు బానోత్ అభి,మరికంటి జలాలు, చరణ్, చేతన్ . పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments