హైదరాబాద్ కేకే మీడియా ఎప్రిల్ 10
కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆమె.. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపారు. మరో మూడు బిల్లులకు మాత్రం ఆమోద ముద్ర వేశారు. ఇంకా రెండు బిల్లులను పెండింగ్‌లోనే ఉంచారు.
కాగా.. పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పంచాయితీని తేల్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ పిటిషన్‌పై నేడే(సోమవారం) విచారణ జరగనుంది. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది..