నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 1:
నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నందమూరి కోటేశ్వరరావు ఈరోజు గుండెపోటుతో మరణించడంతో పెంచికల్ తిన్న మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ నాయకులు కొంజేటి జ్యోతి బాబు సింగిల్ విండో డైరెక్టర్ వల్లం చెట్ల భుజంగరావు పెంచికలదిన్నెలోని కోటేశ్వరరావు స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులు రపించి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నందమూరి కోటేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా పెంచికలదిన్నె గ్రామానికి 1970 నుండి 80వ సంవత్సరం వరకు పది సంవత్సరాలు గ్రామ సర్పంచ్ గా 1981 నుండి 87 వరకు అదే గ్రామానికి ఉప సర్పంచిగా సేవలందించారు. ఈ సందర్భంగా గ్రామానికి వారి సేవలను కొనియాడారు