నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 9
పెంచికల్డన్న గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ మిర్యాలగూడ డిపో మేనేజర్ బుల్లేద్దు పాల్ కు పెంచికల్డెన్న మాజీ సర్పంచ్, క్రాంతినికేతన్ స్వచ్చంద సంస్థ చైర్మన్ సుంకర క్రాంతి కుమార్ మంగళవారం నాడు వినతిపత్రం అందజేసారు. ఎన్నో సంవత్సరాలుగా మిర్యాలగూడ నుండి సూర్యపేట వరకు పెంచికల్ దిన్న , కల్లూరు ముకుందాపురం ,దాచారం తదితర గ్రామాల ప్రయాణికులకు ఉపయోగపడిన ఆర్టీసీ గత కొన్ని సంవత్సరాలు గా సకరం లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం, ఆ గ్రామాల నుంచి నేరేడుచర్ల, మిర్యాలగూడ వస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడేలా ఆర్టీసీని పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల జయ బాబు పాల్గొన్నారు.