హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 23
. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఓజో ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ గత మూడు సంవత్సరాలుగా ఏదో ఒక ప్రధాన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా మీ అందరూ ఆశీర్వదించండి ఇదే సామాజిక సేవలతో పాటు అధికార సేవలకు అవకాశం కల్పించండి అంటూ హుజూర్నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలతో పాటు ప్రచారం చేసుకున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పిల్లుట్ల రఘు ఆటో కాంగ్రెస్ ఇటు బి ర్ యస్ లకు చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ కోటాలో టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ టికెట్ లభించకపోవడంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుతో ఎన్నికల బడిలో దిగిన రఘు ప్రధాన ప్రత్యర్థులకు దీటుగా తన ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. బిసి అభ్యర్థిగా సామాజిక కోణంలో అన్ని వర్గాల ప్రజలకు గత మూడేళ్లుగా ఓజో ఫౌండేషన్ పేరుతో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చానని వందలాదిమంది విద్యార్థులను ప్రయోజకులు చేసేందుకు ఉచిత కోచింగులు ఇప్పించి ఉపాధి అవకాశాలు కోసం ప్రయత్నించాలని ఒక్కసారి ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పిస్తే హుజూర్నగర్ రూపురేకలు మారుస్తానని ఆశీర్వదించండి అంటూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా తన సర్వశక్తులు వొడ్డుతు ప్రత్యర్ధులకు సవాల్ విసురుతున్నాడు. పిల్లుట్ల రఘుకు వస్తున్నాను స్పందనతో కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు చుక్కలు చూపిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచారంలో దూకుడు ప్రజల నుంచి ఆదరణ, మద్దతు ఓటు బ్యాంకుగా మారితే కాంగ్రెస్ , టిఆర్ఎస్ లలో ఏ పార్టీకి ఎక్కువ ప్రభావం పడనందో అని పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి.