నేరేడుచర్ల, కేకే మీడియా
మండలంలోని బోడల్ దిన్నె గ్రామానికి చెందిన మల్లెపూల లింగయ్య,యాలకానీ లింగయ్య గొర్లపై శుక్రవారం పిడుగు పడి 39 గొర్రెలు మృతి చెందాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తమ గొర్రెలను మేత కోసం ఊరి చివర్లో ఉన్న ప్రాంతానికి తోలుక పోయామని, కొద్దిసేపట్లోనే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చిందన్నారు. ఈక్రమంలో 300 గొర్రెల గుంపు పై పిడుగు పడగా అందులో 39 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. మృతి చెందిన గొర్రెల విలువ సుమారుగా రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.