కేకే మీడియా నేరేడుచర్ల ఆగస్టు 27
నేరేడుచర్ల పట్టణంలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిడిఎస్యు 50 వసంతాల సభ నిర్వహించారు ఈ సందర్బంగా పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్, రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం, విద్యార్థి హక్కులు కాపాడడం కోసం అలుపెరగని విద్యార్థి ఉద్యమాలు కొనసాగిస్తున్న విద్యార్థి సంఘం పిడిఎస్యు అని అన్నారు. ఈ దేశంలో పేదలు అట్టడుగు వర్గాలకు చెందినటువంటి విద్యార్థులందరికీ సమానమైన శాస్త్రీయమైన విద్యను అందించాలని విద్యార్థి ఉద్యమాల్ని కొనసాగిస్తుంది అన్నారు. విద్యార్థి హక్కులు, విద్యార్థి ఉద్యమాల బలోపేతం కోసం కృషి చేసేటువంటి క్రమంలో రాజ్యం ప్రగతిశీల విద్యార్థి నాయకులను చిత్రహింసల గురిచేసి,నిర్బంధాన్ని పెట్టి ఎన్కౌంటర్లు చేసిన మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న విద్యార్థి సంఘం పిడిఎస్యు అని వారు పునరుద్ఘాటించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభమైన ప్రగతిశీల విద్యార్థుల ప్రయాణం నేడు దేశవ్యాప్తంగా జార్జ్, జంపాల,కోలా శంకర్, శ్రీపాద, రంగవల్లి అమరత్వాల స్ఫూర్తితో విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం కొనసాగుతుందన్నారు. నాడు నరహంతక వెంగళరావు ప్రభుత్వ నిర్బంధ వ్యతిరేక ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వరకు అనేక ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల గొంతును వినిపించిన విద్యార్థి సంఘం చరిత్ర పిడిఎస్యు కు ఉందన్నారు. ఉన్మాదానికి బలైన జార్జి రెడ్డి వారసత్వస్ఫూర్తితో మత ఉన్మాద పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి,ప్రజా ఉద్యమాల బలోపేతం చేయాల్సిన గురుతరమైన బాధ్యత ఈరోజు విద్యార్థులకు ఉందని వారు గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యా బలోపేతం కోసం, ప్రభుత్వ విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మౌలిక వసతుల కోసం అనేక పోరాటాలు చేసి పరిష్కారం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్,పివైఎల్ జిల్లా నాయకులు వాస కర్ణాకర్, పిడిఎస్యు జిల్లా నాయకులు సురం విజయ్,అశోక్,చక్రవర్తి,యశ్వంత్,త్రివేణి నవ్య,రాకేష్,నరేందర్,తనుష్ తదితరులు పాల్గొన్నారు