అశ్రునయనాల నడుమ రమేష్ కు కన్నీటి వీడ్కోలు
అశ్రు నయనాల నడుమ జనహృదయ నేత , స్నేహంతో సహవాసం చేసే స్నేహ పిపాసి, తెలుగుదేశం జిల్లా నాయకుడు పాల్వాయి రమేష్ కు మంగళవారం నాడు అశేష జనవాహిని నడుమ కన్నీటి వీడ్కోలు పలికారు. తెలుగుదేశం పార్టీ పోలీసు బ్యూరో సభ్యుడు బక్కిని నరసింహ, రాష్ట్ర నాయకులు నెల్లూరు దుర్గాప్రసాద్, బంటు వెంకటేశ్వర్లు, మువ్వా అరుణ్ కుమార్, సిపిఎం రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, ఐజేయు రాష్ట్ర నాయకులు చలసాని శ్రీనివాసరావు, తదితరు అన్ని పార్టీల ముఖ్య నాయకులు , అశేష మిత్ర బృందం, వందలాది మంది అభిమానులు నడుమ పూలమాలలతో నివాళులు అర్పించి బాణా సంచాల, డీజే, డప్పు, బ్యాండ్ వాయిద్యాల నడుమ భారీ ర్యాలీగా చివరి మజిలీ వరకు వెళ్లి నివాళులర్పించారు.
సోమవారం నాడు వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించి, అన్న తర్పణాన్ని దగ్గరుండి పర్యవేక్షించి చివరి భక్తుల వరకు మంచి చెడులను చూస్తూ అడిగి తెలుసుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, ఎంతో ఆప్యాయంగా పలకరించిన రమేష్ కార్యక్రమం పూర్తయిన మరుగంటకే ఆ దేవుడు సన్నిధిలోనే కుప్పకూలిపోయి ఆసుపత్రి వరకు వెళ్లిన ప్రాణం వీడి కాలారాని లోకాలకు వెళ్లిన మిత్రుని,శ్రేయోభిలాషి తుది వీడ్కోలలో చిరకాల మిత్రులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొనతం చిన వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు నాగండ్ల శ్రీధర్, సిపిఎం జిల్లా నాయకులు పారేపల్లి శేఖర్ రావు ఇతర అభిమానులు మిత్రబృందం దగ్గరుండి పూర్తి కార్యక్రమాన్ని నిర్వహించి వీడ్కోలలో పాల్గొన్నారు.