నేరేడుచర్ల కేకే మీడియా
నేరేడుచర్లలోని హుజూర్నగర్ రోడ్ లో గల పాత ఇనుము షాపు నందు దొంగతనం చేసిన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కు చెందిన తాళ్లూరి కనకాచారిని సోమవారం అరెస్టు చేసి అతని నుండి రెండు మోటార్ సైకిళ్ళు, 25 వేల రూపాయల విలువగల పాత ఇనుప సామానులు రికవరీ చేసినట్లు నేరేడుచర్ల ఎస్ఐ ఎ.రవీందర్ నాయక్
తెలిపారు. రిమాండ్ నిమిత్తం అతన్ని కోర్టులో హాజరు పరిచామని, ఇతనిపై రంగారెడ్డి జిల్లా సరూర్నగర్, మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ల లో కేసులు నమోదు అయినట్లు ఎస్సై చెప్పారు.