నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 15
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నగదు ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నాడు
భారత 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేరేడుచర్ల మండలం లోని పెంచికల్ దిన్నె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగుల పంపిణీ చేశారు నేరేడుచర్ల మండలం సోమవారం గ్రామానికి చెంది హైదరాబాదులో స్థిరపడిన కటుకూరి రంగారెడ్డి తన తండ్రి అయిన పాఠశాల పూర్వ అధ్యాపకులు విశ్రాంత ఉపాధ్యాయులు కీ.శే. కటుకూరి సోమేశ్వర్ రెడ్డి పేరిట 100 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యాజమాన్య కమిటీ చైర్మన్, దాత రంగారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.అదే విధంగా అరబండి రామచంద్రయ్య కనకదుర్గ ట్రస్ట్ తరుపున ప్రతి సంవత్సరం అందించే ప్రోత్సాహకాలలో భాగంగా వల్లంశట్ల లచ్చయ్య , అరబండి శ్యాం ప్రసాద్ (అమెరికా) చదువుల్లో ప్రతిభ చూపిన 35 మంది విద్యార్థులకు సుమారు 15 వేల రూపాయల నగదు బహుమతులు అందజేశారు. విశ్రాంత ఉపాధ్యాయులు కీ.శే. నరజాల కుమార్ స్వామి పేరు మీద బెంగళూరులో స్థిరపడిన వారి కుమారుడు నరజాల శ్రీనివాస్ ఐదవ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన మొదటి ముగ్గురికి నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి సుంకర వాణి శ్రీరామ్మూర్తి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పెద్దలు పారేపల్లి సత్యం, అలవాల శ్రీధర్, ఊటుకూరు సైదులు, అలవాల రమేష్, ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ విజయకుమారి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిరికొండ అనిల్ కుమార్, యాజమాన్య కమిటీ చైర్మన్ మేకల సావిత్రి, ఉపాధ్యాయులు వీర్య, శ్యాంప్రసాద్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.